మోదీ @75.. వాట్ నెక్స్ట్?
సెప్టెంబర్ 17.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు. దేశ విదేశీ ప్రముఖులు, అయన తమ కుటుంబంగా భావించే 140 కోట్ల మంది భారతీయులు శుభాకాంక్షలు చెపుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వహించవచ్చు. ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే ప్రకటించవచ్చు.