English | Telugu
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విజయవాడలో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు.
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో మధ్యాహ్నం జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
టీటీడీ దేవస్థానంలో పని చేస్తున్ననలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ లో మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత అన్నది ఎండమావే అన్న విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తాజాగా రేవంత్ రెడ్డి మరో పదేళ్లు తానే సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి సంచలన కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఇండియా కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. సరిగ్గా పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముంగిట కూటమి నుంచి వైదొలగుతూ ఆప్ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి ఇబ్బందికరమేననడంలో సందేహం లేదు.
టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమై, తీవ్ర ఆర్థిక సమస్యలతో చికిత్సకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమైన మొత్తాన్ని అందించేందుకు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ మరింత వేగం పెంచింది. ఇప్పటికే పలువురిని సిట్ విచారించి..కొందరిని అరెస్ట్ చేసింది. అయితే తాజాగా సిట్ అరెస్టు చేస్తుందని ముందస్తు బెయిల్ కోసం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టు, సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని రెండు కోర్టులూ కూడా స్పష్టం చేశాయి.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి చిగురుటాకులా భాగ్యనగరం వణుకిపోతుంది.
ఏపీలో మాజీ సీఎం జగన్ పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది. తన తండ్రి మరణించినప్పటి నుంచీ ఆయన ఏదో ఒక రూపంలో రాజకీయం చేస్తూ జనం నోళ్లలో నానుతూనే వస్తున్నారు.
పాలమూరు జిల్లా అంటే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి చిన్నచూపని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలు లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ , ఏపీ లిక్కర్ స్కాం మధ్య లింకులు ఉన్నట్లు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. మాజీ ముఖ్యంత్రులు కేసీఆర్, జగన్‌ల జాయింట్ ఆపరేషన్‌తోనే ఈ కుట్రలు జరిగాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తెలుగు దేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశారు. అలాగే పార్టీ పొలిట్ బ్యూరో పదవికి కూడా రిజైన్ చేశారు. ఇటీవల రాష్ట్ర పతి ఆయన్ను గోవా గవర్నర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలవలేదు కానీ కలిస్తే తప్పేంటి..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. గచ్చిబౌలి, కొండాపూర్ హైటెక్ సిటీ, జూబిలీహిల్స్, బంజారహిల్స్, యూసఫ్ గూడ, మధురానగర్, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. తాడిపత్రి పర్యటనకు తాజాగా ఆయనకు అనుమతి నిరాకరించారు.