English | Telugu
చత్తీస్గడ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఇవాళ తండ్రీకొడుకులిద్దరికీ చెందిన ఆస్తులపై భారీ బందోబస్తు నడుమ అధికారులు సోదాలు నిర్వహించారు
రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించడంతో.. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మిథున్‌రెడ్డికి అక్కడా చుక్కెదురైంది.
కాకినాడను తన అక్రమాలకు అడ్డగా మార్చుకుని వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నియంతలా చెలరేగిపోయారు. వైసీపీ ప్రభుత్వంలో గోదావరి జిల్లాల సీఎంగా ద్వారంపూడి చక్రం తిప్పారు. రేషన్ బియ్యం దగ్గర నుంచి డ్రగ్స్ వరకు ఆయన టీమ్ అన్ని రకాల దందాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికి తత్వం బోధపడిందా? జనం మూడ్ అవగతమైందా? అందుకే జనంలోకి రావాలన్న తన కార్యక్రమాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగాల కోతకు కారణమౌతుందంటూ ఒక వైపు ఆందోళన వ్యక్తం అవుతుంటే.. మరో వైపు ప్రతిభావంతుల కోసం టెక్ దిగ్జజాలు కాగడా పెట్టి గాలిస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో ఆశించిన ఫలితాలు అందుకోవడంలో ఫెయిల్ అయిందనే అభిప్రాయమే గట్టిగా వినిపిస్తోంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తిరుమల ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న రద్దీ, ప్రయాణీకుల నుంచి వచ్చిన విజ్ణప్తుల మేరకు తిరుమతికి వివిధ ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లను నడపడానికి నిర్ణయించింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. 66 వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లకు ఛైర్మన్లను ఖరారు చేసింది.
గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామ చేసిన నేపధ్యంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంతో పాటుగా గోషామహల్’నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతుందన్న వ్యూహగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోమారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో పాటుగా, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్’గా విమర్శనా అస్త్రాలు సంధించారు.
బీఆర్ఎస్ పాలనలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన లుచ్చా పనుల ఫలితంగానే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల నుండి ఈ లవ్ లెటర్ (నోటీసులు) అందుకోవాల్సి వచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం (సిట్) అధికారులు ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రముఖులను విచారణకు పిలిచి స్టేట్ రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.