English | Telugu

సింగపూర్ లో ప్రముఖ సింగర్ మృతి.. స్కూబా డైవింగ్ లో ఏం జరిగింది!

కొంత మంది గాయకులు సంగీత ప్రపంచంలో తమకంటుఒక బ్రాండ్ ని సృష్టించుకుంటారు. అటువంటి బ్రాండ్ ని సృష్టించుకున్న గాయకుడు 'జుబీన్ గార్గ్'(Zubeen Garg). జుబిన్ ప్రధానంగా 'అస్సామీ' భాషకి చెందిన గాయకుడైనా, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, సంస్కృతంతో సహా దాదాపు 60 భాషలలో పాటలు పాడాడు. తన అద్భుతమైన గాత్రంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

జుబీన్ కొంతకాలం క్రితం 'ఈశాన్య రాష్త్ర ఉత్సవానికి సంబంధించిన ఫెస్టివల్ లో పాల్గొనడానికి సింగపూర్‌ వెళ్ళాడు. అక్కడ 'స్కూబా' డైవింగ్(Scuba Diving)చేసే సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు.రీసెంట్ గా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జుబిన్ అభిమానులు షాక్ లో ఉన్నారు. త్వరలోనే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ అంతలోనే ఆయన చనిపోవడం దారుణమని తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

2006 లో వచ్చిన గ్యాంగ్ స్టర్ సినిమాలోని 'యా అలీ' సాంగ్ తో జుబిన్ బాగా ఫేమస్ అయ్యాడు. రచయిత, నటుడుగా కూడా తన సత్తా చాటిన జుబిన్ నవంబర్ 18, 1972న మేఘాలయలో జన్మించాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.