English | Telugu

ఈ నెలాఖరు నుంచి బరిలోకి దిగనున్న కేజీఎఫ్ యష్ 

కేజీఎఫ్(kgf)సిరీస్ తో ఇండియా వ్యాప్తంగా యష్(yash)సృష్టించిన ప్రభంజనం గురించి అందరకి తెలిసిందే.కానీ ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వెను వెంటనే సినిమా చెయ్యకుండా అభిమానులకి కేజీఎఫ్ ని మించి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఇప్పుడు టాక్సిక్(toxic)అనే విభిన్నమైన మూవీని చేస్తున్నాడు. యష్ సరసన రామ్ చరణ్(ram charan)గేమ్ చేంజర్(game changer)భామ కియారా అద్వానీ(kiyara adwani)హీరోయిన్ గా చేస్తుండగా మలయాళ అగ్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్(geethu mogan das)దర్శకురాలు.

ఆగస్టు 8 న బెంగుళూరులో షూటింగ్ ని ప్రారంభించిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ లోనే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా ఆ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న యూనిట్ మరో షెడ్యూల్ కి ముహుర్తాన్ని ఫిక్స్ చేసిందనే వార్తలు వస్తున్నాయి.ఈ నెలాఖరున ముంబై లో షూటింగ్ జగనుందని,అందుకోసం ప్రత్యేకంగా కొన్ని భారీ సెట్లని కూడా వేశారనే ప్రచారం జరుగుతుంది.అందులో యష్ అండ్ హీరోయిన్ కియారా పై కొన్ని రొమాన్స్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని, మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరగబోతున్న ఈ షెడ్యూల్ లో చిత్ర ప్రధాన తారాగణం కూడా పాల్గొనబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

2025 ద్వీతీయార్ధంలో విడుదల అవుతున్న టాక్సిక్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి కూడా కీలక పాత్రల్లో మెరవనున్నారు.పైగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో యష్ అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా యష్ కూడా తన మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ పై మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.