English | Telugu
అసలు 'పుష్ప' ఎక్కడ?
Updated : Apr 5, 2023
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప-2' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 'Where is Pushpa?' పేరుతో బుధవారం ఉదయం 20 సెకన్ల నిడివి గల గ్లింప్స్ ను విడుదల చేశారు. 2004 లో కథ జరుగుతున్నట్లుగా వీడియోలో చూపించారు. "తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప" అనే వాయిస్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. 'అసలు పుష్ప ఎక్కడ?' అనే ప్రశ్నతో, జనాల ధర్నాలు, పోలీసుల లాఠీఛార్జ్ తో అదిరిపోయే విజువల్స్ తో గ్లింప్స్ రూపొందింది. పూర్తి వీడియోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు(ఏప్రిల్ 8) కానుకగా ఒకరోజు ముందుగా ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 కి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 20 సెకన్ల గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న 'పుష్ప-2' టీమ్.. ఫుల్ వీడియోతో ఇంకెంతలా మెప్పిస్తుందో చూద్దాం.
'పుష్ప-1' తో పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో పుష్ప రెండో భాగంగా వస్తున్న చిత్రం 'పుష్ప: ది రూల్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశముంది.