English | Telugu

అల్లు అర్జున్‌కి అవమానం.. బన్నీ ఫ్యాన్స్‌, మెగా ఫ్యాన్స్‌ మధ్య మళ్లీ వార్‌!

గత కొన్ని సంవత్సరాలుగా అల్లు అర్జున్‌ లుక్‌ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప రిలీజ్‌ ముందు నుంచి ఇప్పటివరకు గడ్డంతోనే ఉంటున్నాడు. అలాంటిది ఒక్కసారిగా లుక్‌ మారిపోయింది. ప్రస్తుతం అట్లీ కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం బన్నీ లుక్‌ పూర్తిగా మార్చేశాడు అట్లీ. పుష్పకు ముందు ఎలా ఉండేవాడో.. మళ్ళీ ఆ లుక్‌ తీసుకొచ్చాడు. ఇప్పుడా లుక్‌ వల్ల అల్లు అర్జున్‌కి ఘోరమైన అవమానం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మెగా ఫ్యాన్స్‌, బన్నీ ఫ్యాన్స్‌ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. అల్లు అర్జున్‌కి అవమానం జరిగితే ఫ్యాన్స్‌ ఎందుకు యుద్ధానికి దిగారు అనే విషయం తెలుసుకుందాం.

అట్లీ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాకి సంబంధించిన షూటింగ్‌ కోసం గత నెల ముంబాయి వెళ్లాడు బన్నీ. తన షెడ్యూల్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌ రిటర్న్‌ అయ్యారు. ముంబాయి విమానాశ్రయంలోకి మాస్క్‌తో వచ్చారు అల్లు అర్జున్‌. సెక్యూరిటీ చెక్‌లో భాగంగా బన్నీని మాస్క్‌ తియ్యమన్నారు. బన్నీతో వున్న వ్యక్తి అతను అల్లు అర్జున్‌ అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, సెక్యూరిటీ ఆఫీసర్‌ మాత్రం ఫేస్‌ చూపించాలని అడిగారు. తప్పని పరిస్థితిలో బన్నీ తన మాస్క్‌ తీసి ఫేస్‌ చూపించారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. ‘ఒక హీరోని గుర్తు పట్టలేకపోయారు.. అల్లు అర్జున్‌ పరువు పోయిందిగా’, ‘మాస్క్‌ ఎందుకు పెట్టుకున్నట్టు.. ఏమైనా జబ్బులు ఉన్నాయా’, ‘వాళ్ళ డ్యూటీ వాళ్లు చేస్తున్నారు.. ఎందుకంత బిల్డప్‌’, ‘అల్లు అర్జున్‌కి పొగరు ఏమాత్రం తగ్గలేదు’.. కామెంట్స్‌ వస్తున్నాయి. వాళ్ళంతా మెగా ఫ్యాన్స్‌ అని అర్థమవుతూనే ఉంది. ‘మాస్క్‌ ఉంటే ఎవరినైనా గుర్తు పట్టడం కష్టం.. అందులో పరువుపోయేది ఏముంది?’, ‘సెక్యూరిటీకి సహకరించడం తప్పు ఎలా అవుతుంది అంటూ బన్నీ ఫ్యాన్స్‌ రిప్లయ్‌ ఇస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం