English | Telugu
‘వార్ 2’ రిలీజ్ డేట్ లాక్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో!
Updated : Nov 29, 2023
జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందనున్న ఈ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించనున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో తారక్, హృతిక్ పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే అప్పుడే మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేయడం విశేషం.
ఇండిపెండెన్స్ డే కానుకగా ఒకరోజు ముందుగా 2025, ఆగస్టు 14న(గురువారం) 'వార్ 2' చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇది పర్ఫెక్ట్ డేట్ అని చెప్పవచ్చు. ఆగస్టు 14న రిలీజ్ డే, ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే హాలిడే, 16,17న శని ఆదివారాలు కావడంతో నాలుగు రోజుల లాంగ్ ఫస్ట్ వీకెండ్ దొరికింది. రెండో వారంలో ఆగస్టు 27న వినాయక చవితి, మూడో వారంలో సెప్టెంబర్ 4న ఈద్ కలిసి వచ్చాయి.
అసలే ఇండియాలోని ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే 'వార్ 2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు అదిరిపోయే రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. ఇక మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.