English | Telugu

'సింహాద్రి' రీరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా ఆ హీరో!

రీరిలీజ్ ట్రెండ్ ని మరోస్థాయికి తీసుకెళ్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. 2003 లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'సింహాద్రి' సినిమాని 20 ఏళ్ళ తర్వాత రీరిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న ఈ చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మీడియం రేంజ్ హీరో కొత్త సినిమా స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రీరిలీజ్ సినిమాల పరంగా పలు చోట్ల సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ రీరిలీజ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ కొత్త ట్రెండ్ కి కూడా శ్రీకారం చుట్టారు.

కొత్త సినిమాల విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించడం కామన్. అయితే రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడం అనే సరి కొత్త ట్రెండ్ సింహాద్రి తో మొదలవుతోంది. రేపు(మే 17) సింహాద్రి రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్న ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్ హాజరుకానున్నాడు. ఎన్టీఆర్ కి విశ్వక్ ఎంతటి వీరాభిమానో తెలిసిందే. పలు వేదికలపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు విశ్వక్ కోసం 'దాస్ కా ధమ్కీ' ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా కూడా హాజరయ్యాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ రీరిలీజ్ అవుతుంటే.. ఆ వేడుకకు విశ్వక్ గెస్ట్ గా హాజరవవుతూ తన అభిమానాన్ని మరోసారి చాటుకుండటం విశేషం. మొత్తానికి 'సింహాద్రి' రీరిలీజ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంచలనం సృష్టించేలా ఉన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.