English | Telugu

విజయ్ దేవరకొండ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ అయింది!

గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాహుల్ సంకత్యాన్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘రణబలి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.

స్వాతంత్య్రానికి ముందు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉంటుంది. వలసలు, కరవు జీవితం, జానపద కథలు, తిరుగుబాటు భావాలు వంటి ఎలిమెంట్స్‌తో ఈ కథను రూపొందించారు. ఇందులో విజయ్ దేవరకొండ ఒక వీరయోధుడిగా కనిపించబోతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారు.

ఇంతకుముందు విజయ్, రాహుల్ కాంబినేషన్‌లో వచ్చిన టాక్సీవాలా మంచి విజయాన్ని సాధించింది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఒక సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుండగా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుందని అందరూ భావిస్తున్నారు.

సోమవారం టైటిల్‌తోపాటు సినిమాలోని విజయ్ దేవరకొండ లుక్‌ను కూడా రివీల్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటివరకు విజయ్ చేసిన క్యారెక్టర్లకు భిన్నమైన క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నారని తెలుస్తోంది. ఇది అతనికి కంబ్యాక్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ కూడా ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం