English | Telugu

జపాన్ అభిమాని చేసిన పనికి షాక్ అయిన అల్లు అర్జున్, రష్మిక!

తెలుగు సినిమాలకు జపాన్‌లో ఎంతటి ఆదరణ ఉంటుందో అందరికీ తెలిసిందే. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కూడా జపాన్ అభిమానులను సంపాదించుకున్నారు. పుష్ప2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్, రష్మిక ఇద్దరూ కలిసి జపాన్ వెళ్లారు. ఎంతో సందడిగా జరిగిన ఈ పర్యటనలో కజు అనే జపనీస్ అభిమాని మాటలకు బన్ని, రష్మిక షాక్ అయ్యారు. వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేస్తూ తెలుగులో మాట్లాడి ఆ అభిమాని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

బన్నీ అతనితో జపనీస్‌లో మాట్లాడాలని ట్రై చేస్తుండగా కజు మాత్రం ‘మీరు తెలుగు సినిమాలకే గర్వకారణం. మీ నటన అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు చాలా అందమైన భాష. నేను నేర్చుకుంటున్నాను, దయచేసి నా తెలుగును భరించండి’ అని చెప్పడంతో బన్నీ, రష్మిక షాక్ అయి చప్పట్లు కొడుతూ అతన్ని అప్రిషియేట్ చేశారు.అతని తెలుగు చూసి ‘నీ తెలుగు చాలా బాగుంది, నువ్వు ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి’ అని బన్నీ అనడంతో అక్కడి వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

బన్ని, రష్మికలతో జరిగిన ఈ చాటింగ్ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంటూ ‘భారతదేశ అగ్ర నటులను ఇంటర్వ్యూ చేసే గౌరవం దక్కినందుకు కృతజ్ఞుడను’ అని రాశాడు కజు. ఇప్ప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. తెలుగు భాష గొప్పతనం ప్రపంచవ్యాప్తం అవుతోందని అభిమానులు ఎంతో గర్వంగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇప్ప్పుడు ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం