English | Telugu

నటి విద్యాబాలన్ పై కేసు

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ మీద కేసు పెడుతున్నారు. అదికూడా పోలీసులు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ డ్యాన్సర్, నటి సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా, విద్యా బాలన్ ఆమె పాత్రలో నటించగా, మిలన్ లుథాచియా దర్శకత్వంలో, జితేంద్ర కూతురు ఏక్తా కపూర్ "డర్టీ పిక్చర్" అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా తాలూకు పోస్టర్లు కానీ, ఈ చిత్రం ట్రైలర్లు కానీ స్త్రీలను అవమానించే విధంగా ఉన్నాయని అనేక మహిళా సంఘాలు, లాయర్లూ మండిపడుతున్నారు.

వారు కోర్టులో వేసిన కేసు ఫలితంగా కోర్టువారు IPC "ది ఇన్ డీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్" చట్టం ప్రకారం విద్యాబాలన్ పై డిసెంబర్ 31 లోగా కేసు నమోదు చేసి, నివేదికను కోర్టు వారికి సమర్పించాలనీ కోర్టు ఆదేశించింది. అంతే కాదు ఈ చిత్ర నిర్మాత ఏక్తా కపూర్, దర్శకుడు మిలన్ లుథాచియాలపై కూడా కేసులు నమోదుచేయాల్సిందిగా కోర్టు వారు పోలీసులను ఆదేశించారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.