English | Telugu

వెంకటేష్ కుటుంబంలో తీవ్ర విషాదం.. తను లేని లోటుని ఎవరు తీర్చలేరు

సినిమాల పరంగా చూసుకుంటే విక్టరీ వెంకటేష్(Venkatesh)తన అప్ కమింగ్ మూవీని 'త్రివిక్రమ్'(Trivikram)దర్శకత్వంలో చేస్తున్నాడు. వెంకటేష్ కెరీర్ లో 'నువ్వు నాకు నచ్చావు. మల్లేశ్వరి' మంచి హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలకి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించాడు. దీంతో ఈ కాంబో సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మాయా జాలాన్ని ప్రదర్శిస్తుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉండగా, త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.

రీసెంట్ గా వెంకటేష్ పెంపుడు శునకం గూగుల్(Google)చనిపోయింది. ఈ విషయంపై వెంకటేష్ ఇన్ స్టాగ్రామ్(Instagram)వేదికగా స్పందిస్తు 'నా నమ్మకమైన, ప్రియమైన గూగుల్. గత 12 ఏళ్లుగా మా జీవితాల్లో భాగమయ్యావు. ఎంతో ప్రేమని పంచావు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు కూడా ఇచ్చావు. నువ్వే మా సన్‌షైన్. ఇక నీకు వీడ్కోలు. నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను డియర్ ఫ్రెండ్ అంటూ వెంకటేష్ గూగుల్ తో తాను దిగిన పిక్స్ తో నోట్ ని రాసుకొస్తు షేర్ చేసాడు.

ఇక త్రివిక్రమ్ తర్వాత 'వివి వినాయక్'(VV Vinayak)దర్శకత్వంలో వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో 'లక్ష్మి' వచ్చి వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.