English | Telugu

వరుణ్ తేజ సినిమా మొదలయ్యింది.

మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్ర ముహూర్త కార్యక్రమం నేడు ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, అల్లు అర్జున్ మరియు మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు చిత్ర పరిశ్రమ పెద్దలు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి అవ్వగానే పవన్ కళ్యాణ్ వెంటనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ... "మా కుటుంబాన్ని ఎంతగానో ఇప్పటి వరకు ఆదరిస్తూ వచ్చారు. మా మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మా బిడ్డ వరుణ్ తేజ్ ను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. చరణ్ జమ్మూలో షూటింగ్ కారణంగా రాలేకపోయాడు. నాగబాబు అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాకు చాలా ఇష్టమైన వాడు." అని అన్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.