English | Telugu

పవన్ తో చెయ్యట్లేదు

నానితో కలిసి "ఆహా కళ్యాణం" చిత్రంలో కలిసి నటించిన వాణీకపూర్ త్వరలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న "గబ్బర్ సింగ్- 2" చిత్రంలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలన్ని కూడా పుకార్లే అని కొట్టిపారేసింది వాణీ. ఈ సందర్భంగా వాణీ మాట్లాడుతూ... ప్రస్తుతానికి తాను రెండు యాశ్ రాజ్ సినిమాలు తప్ప మరే చిత్రాలు కూడా ఒప్పుకోలేదు. అసలు పవన్ తో సినిమా గురించి నా వద్దకు ఎవరు రాలేదు. ఎలాంటి రూమర్లను నమ్మకండి. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుంది" అని తన మనసులో మాటను చెప్పేసింది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.