English | Telugu

ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్చ


గత కొంత కాలంగా హైదరాబాద్‌లోని రామ్ నగర్‌లో నివాసం వుంటున్న స్వేచ్చ ఇటీవలే తన తల్లిదండ్రులతో కలిసి జవహర్ నగర్‌లో వుంటున్నారు. జవహర్ నగర్‌లో వుంటున్నస్వేచ్చ వొటార్కర్ తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే రామ్ నగర్‌లో వుంటున్న స్వేచ్చ ఎందుకు జవహర్ నగర్‌కి వెళ్లారు.... సూసైడ్ ఎందుకు చేసుకున్నారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.