English | Telugu

వివాదంలో 'జవాన్' డైరెక్టర్ అట్లీ!

భారీ కలెక్షన్స్ రాబట్టి ఘన విజయం సాధించిన సినిమాలు అవార్డులు గెలుపొందాలనీ లేదు. విమర్శకుల ప్రశంసలు, అవార్డులు గెలుపొందిన సినిమాలు కలెక్షన్స్ రాబట్టాలనీ లేదు. కొన్ని కమర్షియల్ సినిమాలు యావరేజ్ టాక్ తోనే కలెక్షన్లు కొల్లగొడతాయి. కొన్ని గొప్ప సినిమాలుగా పేరు తెచ్చుకొని కూడా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చి, అవార్డులకు పరిమితమవుతాయి. అటు కలెక్షన్లు కొల్లగొట్టి, ఇటు అవార్డులు గెలుచుకునే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించని కొందరు దర్శకులు.. తాము తీసిందే గొప్ప సినిమా అని, అందుకే కలెక్షన్ల వర్షం కురిసిందని, ఎలాంటి అవార్డులైనా రావాల్సిందే అనే భ్రమల్లో ఉంటారు. దర్శకుడు అట్లీ అలాంటి భ్రమల్లోనే మునిగిపోయి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'జవాన్'. సెప్టెంబరు 7న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ.900 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇది వసూళ్ల పరంగా ఇండియన్ సినిమాలలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవనుంది. జవాన్ ఈస్థాయి వసూళ్లు రాబట్టడానికి కారణం ఇందులో మాస్ ని మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక కమర్షియల్ సినిమాగా చూస్తే 'జవాన్' పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. అయితే ఇది ప్రేక్షకులను ఎంతలా మెప్పించినా, ఎంతలా కలెక్షన్స్ రాబట్టినా.. గొప్ప సినిమా అని మాత్రం అనలేం. ఎందుకంటే ఇది పలు సౌత్ సినిమాలను మిక్స్ చేసి తీసినట్లు ఉంటుంది. నార్త్ ప్రేక్షకులకు ఇది కాస్త కొత్తగా అనిపించినప్పటికీ, సౌత్ ప్రేక్షకులకు మాత్రం పరమ రొటీన్. అయితే సినిమాని బోర్ కొట్టకుండా, మాస్ ప్రేక్షకులు మెచ్చేలా, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా మలచడంతో సౌత్ లో కూడా బాగా ఆదరిస్తున్నారు. దీంతో తమ సినిమాకి అన్ని చోట్లా బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి, తమది గొప్ప సినిమా అని భావించిన డైరెక్టర్ అట్లీ.. ఏకంగా ఆస్కార్ పై కన్నేశాడు. జవాన్ సక్సెస్ జోష్ లో ఉన్న అట్లీ తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటిస్తూ.. తమ సినిమాని ఆస్కార్స్ కి పంపించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పాడు. ఇదే ఇప్పుడు ట్రోల్స్ కి కారణమైంది. సౌత్ సినిమాలను మిక్స్ చేసి జవాన్ తీసి, ఏదో గొప్ప సినిమా తీసినట్లుగా ఆస్కార్స్ కి పంపుతావా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రావాల్సిన దానికంటే ఎక్కువ విజయం దక్కిందని సంతోషించాల్సి పోయి.. తెలిసితెలియక ఏదో మాట్లాడి ఇలా వివాదాలు, విమర్శలు ఎదుర్కోవడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.