English | Telugu

త్రివిక్రమ్ పాన్ ఇండియా టార్గెట్.. రాజమౌళి, సుకుమార్ ని మించేలా!

టాలీవుడ్ టాప్ దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. 'అత్తారింటికి దారేది', 'అల వైకుంఠపురములో' వంటి సినిమాలతో ఆయన సంచలన విజయాలను అందుకున్నారు. అయితే ఇప్పుడు తన తోటి దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుండటంతో.. త్రివిక్రమ్ చూపు కూడా పాన్ ఇండియా వైపు మళ్లిందట. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'తో రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఇప్పుడు జక్కన్న సినిమాలు గ్లోబల్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక 'పుష్ప'తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన సుకుమార్.. 'పుష్ప-2'తో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. వీరితో పాటు 'దేవర'తో కొరటాల శివ, 'కల్కి 2898 AD'తో నాగ్ అశ్విన్ ఇలా ఎందరో తెలుగు దర్శకులు పాన్ ఇండియా లెవెల్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు కాస్త ఆలస్యంగానైనా అదిరిపోయే ప్లానింగ్ తో త్రివిక్రమ్ అడుగులు పాన్ ఇండియా వైపు పడుతున్నాయట.

త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో 'గుంటూరు కారం' చేస్తున్నారు. 2024 సంక్రాంతికి ఇది రీజనల్ సినిమాగానే విడుదల కానుంది. దీని తర్వాత చేయబోయే సినిమాతోనే త్రివిక్రమ్ పాన్ ఇండియా అడుగులు మొదలు కానున్నాయి. 'గుంటూరు కారం' తర్వాత ఆయన అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నారు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత త్రివిక్రమ్-బన్నీ కలయికలో వస్తున్న నాలుగో చిత్రమిది. పైగా 'పుష్ప'తో బన్నీ ఇప్పటికే పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అందుకే బన్నీతో తాను చేయబోయే సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపొందించబోతున్నారట త్రివిక్రమ్. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. దీని తర్వాత కూడా ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలు చేయడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్, ప్రభాస్ మధ్య కథా చర్యలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఓ సినిమా ఉంటుందని గతంలో నిర్మాత నాగవంశీ చెప్పారు. త్రివిక్రమ్ ఇలా వరుసగా పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలు చేసి సత్తా చాటితే.. పాన్ ఇండియా వైడ్ గా ఆయన పేరు మారుమోగిపోవడం ఖాయం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.