English | Telugu

సారంగదరియా.. చాలా రోజులకు ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్!

ప్రేక్షకులకు బాగా చేరువైన పాటలోని లైన్ ని టైటిల్ గా పెట్టుకొని హిట్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరడానికి మరో చిత్రం ప్రయత్నిస్తోంది. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి(అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'సారంగదరియా'.

ఈ మూవీ టైటిల్ పోస్టర్ తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతులమీదుగా విడుదలైంది. ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "సారంగదరియా ఫస్ట్ లుక్ పోస్టర్ నేను విడుదల చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. పోస్టర్ అండ్ టైటిల్ చూడగానే పాజిటివ్ గా చాలా బాగుంది అనిపించింది. ఫ్యామిలీ చిత్రం గా త్వరలో విడుదల కానున్న సారంగదరియా.. ప్రధాన పాత్రలో నటిస్తున్న మా రాజా రవీంద్ర అన్నకి, ప్రొడ్యూసర్స్ శరత్ చంద్ర గారికి ఉమాదేవి గారికి, ఈ చిత్రం తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్న పద్మారావుకి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. "మా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ అడిగిన వెంటనే విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి చాలా థాంక్స్. త్వరలో మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నాము. మా సారంగదరియా అందరికీ నచ్చేలా ఉంటుంది" అన్నారు.

డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ.. "నేను సారంగదరియాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఉమాదేవి గారికి,శరత్ చంద్ర గారికి ధన్యవాదాలు. ఈ రోజు మా మూవీ పోస్టర్ విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి థాంక్యూ. చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన రాజా రవీంద్ర గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది." అన్నారు.

శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎం. ఎబెనెజర్ పాల్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా సిద్ధార్థ స్వయంభు, ఎడిటర్ గా రాకేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.