Read more!

English | Telugu

త్రిష కొత్త సినిమా ' నాయకి ' టీజర్ టాక్

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన వాళ్లు, కాస్త ఫేడవుట్ అవుతున్నారనిపించగానే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మొదలెట్టేస్తుంటారు. లేటెస్ట్ గా త్రిష ఈ లిస్ట్ లో ఫస్ట్ నేమ్ గా మారింది. మొన్నీమధ్యే కళావతిగా భయపెట్టడానికి ట్రై చేసిన త్రిష, ఇప్పుడు నాయకిగా మరోసారి ఆడియన్స్ భయంతో ఆడుకోవడానికి ట్రై చేస్తోంది. రఘ కుంచే సంగీతం బాగుంది. మాంసం కొట్టే కత్తితో త్రిష కాస్త వయలెన్స్ ను కాస్త ఎక్కువగానే పలికించింది. సినిమాలో సత్యం రాజేష్, బ్రహ్మానందం కామెడీ సీన్స్ ఉంటాయని ఊరించే ప్రయత్నం కూడా టీజర్లో చేశారు. గోవి గోవర్ధన్ డైరెక్ట్ చేస్తున్న నాయకి ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. తమిళంలో నాయగి పేరుతో రిలీజవ్వబోతోంది. గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్నారు. టీజర్ కు రెస్పాన్స్ బాగానే ఉంది. త్రిష ఆశలన్నీ నాయకి మీదే ఉన్నాయి. మరి ఈ హర్రర్ సినిమా, చూసి భయపడేలా చేస్తుందో లేక చూడటానికి భయపడేలా చేస్తుందో చూడాలి.