Read more!

English | Telugu

హంసానందిని అంతెత్తు నుంచి కిందకు దూకేసింది

గోడ మీద నుంచి కిందికి దూకాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. అలాంటింది హీరోయిన్ హంసానందిని ఏకంగా కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకేసింది. రీసెంట్ గా సోగ్గాడే చిన్ని నాయనలో మరదలిగా అందాలతో అదరగొట్టిన హంసకు అందంతో పాటు ధైర్యం కూడా ఎక్కువే అని చెప్పుకోవాలి. న్యూజిలాండ్ లో బంగీజంప్ లొకేషన్ ఉంది. రీసెంట్ గా అక్కడికి వెళ్లిన హంసకు ఆ జంప్ చేయాలనే కోరిక కలిగింది. కానీ అనుకున్నంత సరదా కాదని, అంతెత్తు నుంచి కిందకు చూశాకే పాపకు అర్ధమైంది. దూకడానికి భయపడి కాసేపు లోపల కూర్చుండిపోయినా, చివరికి పట్టుదలగా ముందుకురికింది ఈ సుందరి. తాజాగా ఆ వీడియోను తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో అభిమానులతో పంచుకుంది. అంతేకాదు మీకు సాహసాలు ఇష్టమైతే కంపల్సరీ చేయాల్సిన జంప్ ఇది అంటూ సలహా కూడా ఇస్తోంది.