English | Telugu
త్రిష క్యాడ్బరీ పోయింది
Updated : Dec 11, 2013
క్యాడ్బరీ చనిపోయింది. అదేంటి క్యాడ్బరీ చాక్లెట్ చనిపోవడమేంటి అని అనుకుంటున్నారా? క్యాడ్బరీ అంటే తినే చాక్లెట్ కాదు. అది ఒక కుక్క పేరు. ఆ కుక్క హీరోయిన్ త్రిషది. త్రిషకు క్యాడ్బరీ అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో ప్రాణంగా పెంచుకున్న క్యాడ్బరీ మరణించింది. క్యాడ్బరీ చనిపోవడం వలన త్రిష చాలా బాధపడుతుంది. అసలే త్రిషకు మూగ జీవాలంటే చాలా ఇష్టం. అందుకే "పెటా" తరపున వాటి సంరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్‌తో కలిసి తనవంతు సాయం కూడా చేస్తోంది. అసలే సినిమా ఛాన్సులు రాక బాధపడుతున్న త్రిషకు, క్యాడ్బరీ మరణం మరింత క్రుంగిపోయేలా చేసింది. మరి త్వరలోనే త్రిష కోలుకోవాలని కోరుకుందాం.