English | Telugu
పవన్ కళ్యాణ్ కు మళ్ళీ అస్వస్థత!
Updated : Oct 11, 2024
పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురయ్యారు. జ్వరం, నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నడక మార్గాన తిరుమలకు వెళ్లారు. ఆ సమయంలో కొంత అస్వస్థకు గురైన పవన్.. అప్పటినుంచి నడుము నొప్పితో బాధపడుతున్నట్లు వినికిడి. ఇప్పుడు నడుము నొప్పితో పాటు జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ కూడా తోడు కావడంతో.. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అనారోగ్యం కారణంగానే తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ కి కూడా పవన్ హాజరు కాలేదని అంటున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఆయన రెండు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.