English | Telugu

టైగర్ నాగేశ్వరరావు.. హిందీకి ఎక్కువ, తెలుగుకి తక్కువ

మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషించిన పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' నేడు(అక్టోబర్ 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ, సెకండాఫ్ తేలిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ నిడివి కారణంగా సాగదీతగా అనిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందని చెబుతున్నారు.

టైగర్ నాగేశ్వరరావు నిడివి 3 గంటలు అని తెలిసినప్పుడే.. ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే చిత్ర దర్శకుడు వంశీ మాత్రం నిడివి అసలు సమస్య కాదని, సినిమా చూశాక ఇంకో 30 నిమిషాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. కానీ తీరా విడుదలయ్యాక ఆ నిడివే అసలు సమస్య అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొదట టైగర్ నాగేశ్వరరావు నిడివిని 181 నిమిషాల 39 సెకన్లుగా ప్రకటించారు. ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ తెలుగు వెర్షన్ ని 172 నిమిషాలకు కుదించారు. అయినప్పటికీ తెలుగునాట ల్యాగ్ అనే మాట వినిపిస్తోంది. అయితే హిందీలో మాత్రం 181 నిమిషాల 39 సెకన్ల నిడివితోనే విడుదల చేశారు. పది నిమిషాలు కుదించినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ల్యాగ్ అని అంటున్నారు. అలాంటిది పది నిమిషాల నిడివి ఎక్కువున్న సినిమా చూసి హిందీ ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.