English | Telugu

అప్పుడు రజినీకాంత్.. ఇప్పుడు ప్రభాస్..!

బిగ్ స్టార్స్ హారర్ సినిమాలు చేయడం చాలా అరుదు. అలాంటిది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' అనే ఓ హారర్ ఫిల్మ్ చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్ లో ఆయన హారర్ సినిమా చేస్తున్నాడని ప్రకటన వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. బిగ్ స్టార్ అయ్యుండి ఈ జానర్ ఫిల్మ్ చేస్తున్నాడేంటనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా విడుదలైన 'రాజా సాబ్' టీజర్ వాటన్నింటికీ చెక్ పెట్టింది. టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. (The Raja Saab)

ఈ తరం స్టార్స్ లో హారర్ జానర్ ఎవరూ టచ్ చేయలేదనే చెప్పాలి. ముందు తరం స్టార్స్ కూడా ఈ జానర్ ని పెద్దగా టచ్ చేయలేదు. అందుకే ప్రభాస్ 'రాజా సాబ్'పై అందరి దృష్టి పడింది. అదే సమయంలో రజినీకాంత్ సరసన ప్రభాస్ చేరతాడా? అనే చర్చ కూడా జరుగుతోంది.

గత రెండు దశాబ్దాల్లో స్టార్ హీరో నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ ఫిల్మ్ అంటే 'చంద్రముఖి' అని చెప్పవచ్చు. రజినీకాంత్ హీరోగా దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. 2005లో విడుదలై అప్పటిదాకా తమిళ సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నీ తిరగరాసింది. 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 'రాజా సాబ్'తో ప్రభాస్ కూడా ఆ స్థాయి సంచలనాలు సృష్టిస్తాడా? అనే చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. హిట్ టాక్ వస్తే రూ.500 కోట్లు, బ్లాక్ బస్టర్ టాక్ వస్తే రూ.1000 కోట్లు అనేది ఆయనకి కేక్ వాక్ అయిపోయింది. అసలే హారర్ జానర్ కి భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల క్రేజ్ ఉంటుంది. పైగా ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ తోడయ్యాడు. ఇప్పటికే టీజర్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వస్తే.. 'రాజా సాబ్' బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.