Read more!

English | Telugu

పవన్ తీన్ మార్ 4 రోజుల కలెక్షన్స్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం యొక్క 4 రోజుల కలెక్షన్స్ 23.5 కోట్లని సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మించిన చిత్రం "తీన్ మార్". పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం ఎ క్లాస్ సెంటర్లలో అయితే బాగా కలెక్షన్లు వసూలు చేస్తుంది కానీ, రూరల్ ఏరియాలలో అంటే బి, సి సెంటర్లలో మాత్రం కలెక్షన్ల విషయంలో కాస్త వెనకపడినట్లుగా ఉంది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఏడు కోట్లకు అమ్మారట. ప్రస్తుతం నాలుగు రోజులకు గాను ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం 23.5 కోట్లు వసూలు చేయటంతో ఈ చిత్ర నిర్మాత ఇప్పటికే లాభాల బాటలో పయనిస్తున్నాడని చెప్పవచ్చు. ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రానికి మొత్తం అయిన బడ్జెట్ 26 కోట్ల రూపాయలు. ఇప్పటికి ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం వసూలు చేసిన మొత్తం 23.5 ప్లస్ ఏడు కోట్లు మొత్తం కలిపితే 30.5 కోట్లు వచ్చినట్లు.

 

ఈ నాలుగు రోజుల్లో రోజువారీ ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం యొక్క వసూళ్ళను పరిశీలిద్దాం.

తొలిరోజు కలెక్షన్స్ - 9.40 cr

రెండవ రోజు కలెక్షన్స్ - 4.8 cr

మూడవ రోజు కలెక్షన్స్ - 5.2 cr

నాలుగవ రోజు కలెక్షన్స్ - 4.1 cr

మొత్తం నాలుగు రోజుల కలెక్షన్స్ - 23.5 cr

నాలుగు రోజులకే ఇంత కలెక్షన్స్ వసూలు చేస్తే, అదే వంద రోజులాడితే ఇంకెంత వసూలు చేస్తుందో పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రం.