English | Telugu

‘ది రోడ్’ మూవీ రివ్యూ

మూవీ: ది రోడ్
నటీనటులు: త్రిష, షబ్బీర్ కలరక్కల్, సంతోష్ ప్రతాప్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కె. జి. వెంకటేశ్
ఎడిటింగ్: ఏఆర్ శివరాజ్
మ్యూజిక్: శామ్ సిఎస్
రచన, దర్శకత్వం: అరుణ్ వశీకరన్
ఓటిటి: ఆహా

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఉండే క్రేజే వేరు.‌ అలాంటి కథలో త్రిష ఉంటే ఆమె నటనకి ప్రేక్షకులకి పిధా. మరి తాజాగా ఆహాలో రిలీజైన ' ది రోడ్' మూవీ కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:

మీరా(త్రిష) తన కొడుకు కమిన్, భర్త ఆనంద్ తో హ్యాపీగా జీవితం సాగిస్తుంటుంది‌. అయితే తన కొడుకు పుట్టినరోజుని కన్యాకుమారిలో సెలబ్రేట్ చేయాలనుకుంటుంది మీరా. కన్యాకుమారికి 'రోడ్ ' ద్వారా ప్రయాణించాలని మీరా కొడుకు ఆశపడతాడు. కానీ మీరా ప్రెగ్నెంట్ అని ఆ రోడ్ ప్రయాణం చేయకుండా మీరా భర్త, కొడుకు కలిసి 'రోడ్' లో వెళ్తుంటారు. దారిలో యాక్సిడెంట్ అయి ఇద్దరు చనిపోతారు. అయితే వారిది నిజంగానే యాక్సిడెంటా? లేక ఎవరైన కావాలని చేశారా? మీరా అసలు మిస్టరీ ఛేధించిందా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

రాత్రిపూట నేషనల్ హైవేలో ఒక జంట కారులో వెళ్తుంటారు. వారిద్దరి మధ్య గొడవజరుగుతుంటుంది. ఇంతలో వారి కారు టైర్ పంచర్ అవ్వడంతో రిపేర్ చేసుకొని కొద్దిదూరం వెళ్ళగానే కారు ఆగిపోతుంది. కాసేపటికి వాళ్ళిద్దరు కారులో చనిపోయి ఉంటారు. అసలేమైందనే ఆసక్తితో కథని ప్రారంభించాడు డైరెక్టర్ అరుణ్ వసీగరన్‌.

మీరా తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ సాగిస్తుండగా యాక్సిడెంట్ అయిందంటూ వచ్చిన కాల్ తో తన జీవితం ఎలా మలుపు తిరిగిందో చక్కగా చూపించారు మేకర్స్. మీరా ఫ్రెండ్ ఉమాదేవీ ఒక బ్యాంక్ లో పనిచేస్తుంటుంది. ఉమాదేవీ భర్త ప్రసాద్ చివరగా ఆ యాక్సిడెంట్ చూసి వారిని హాస్పిటల్ కి తీసుకొచ్చి మీరాకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇక్కడివరకు కథ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే రెగ్యులర్ గా ఆ రోడ్ లో ప్రమాదం జరిగిన ప్లేస్ కి వెళ్ళే మీరా ముందే ఒక కారు యాక్సిడెంట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి చూసిన మీరా.. ఆ కారులోని వ్యక్తిని కాపాడలేకపోతుంది‌. అయితే వెనక్కి వచ్చి మళ్ళీ ఆ ప్రమాదం జరిగిన ప్లేస్ కి వస్తే అక్కడ కారు ఉండదు, మనుషులు ఉండరు. దాంతో ఆ హైవేలో ఏదో తప్పు జరుగుతుందని భావిస్తుంది మీరా. అసలేం జరిగిందంటూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే కొన్ని నమ్మలేని నిజాలు మీరాకి తెలుస్తాయి.

ద్వితీయార్థంలో మీరా ఒక్కో క్లూని సాల్వ్ చేస్తూ చివరి వరకు సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుందో కథలో వేగం పెరుగుతుంది. అసలు ఎవరూ ఊహించని మలుపు ఉంటుంది. ప్రతీ రోడ్డుకి ఒక మలుపు ఉన్నట్టే ఈ నేషనల్ హైవే(ది రోడ్) కి ఒక కథ ఉందంటూ ముగించిన తీరు బాగుంటుంది‌. అసలు కథలో వచ్చే ట్విస్ట్ లకి చూసే ప్రేక్షకులు ఒక గొప్ప థ్రిల్ ని ఫీల్ అవుతారు. ఒక మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి. కానీ అదే డబ్బు మనిషిని చంపి తీసుకుంటే అది క్రైమ్ అవుతుంది. డబ్బు లేదని చావాలనుకున్న వాడిని ఆ రోడ్ (ది రోడ్) బ్రతికిస్తే.. అతను ఎలా మారాడో చూపిస్తూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంది‌.

అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. అందరు ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఏఆర్ శివరాజ్ ఎడిటింగ్ బాగుంది. సామ్ సిఎస్ అందించిన బిజిఎమ్ ఆకట్టుకుంది. కె.జి వెంకటేశ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

మీరా పాత్రలో త్రిష నటన ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది. షబ్బీర్ కలరక్కల్, ఆనంద్ పాత్రలో సంతోష్ ప్రతాప్ ఆకట్టుకున్నారు. మిగిలిన వారు వారి పాత్రల మేర నటించి మెప్పించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక ఫీస్ట్.

రేటింగ్ : 2.75/ 5

✍🏻. దాసరి మల్లేశ్

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.