English | Telugu

రాజా సాబ్ టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో 'ది రాజా సాబ్', 'ఫౌజి', 'స్పిరిట్', 'సలార్-2', 'కల్కి-2'తో పాటు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఉన్నాయి. వీటిలో మారుతి దర్శకత్వం వహిస్తున్న 'రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'రాజా సాబ్' మొదట పట్టాలెక్కింది. నిజానికి ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 10కి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ తేదీకి కూడా రాలేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. (The Raja Saab)

'రాజా సాబ్' కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. ఈ రిలీజ్ డేట్ ని టీజర్ తో రివీల్ చేయనున్నారట. ఇప్పటికే టీజర్ కూడా రెడీ అయిందని వినికిడి. త్వరలోనే టీజర్ ప్రేక్షకులను పలకరించనుందట. టీజర్ అద్భుతంగా వచ్చిందని, టీజర్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమాని ఈ ఏడాది చివరిలో లేదా 2026 సంక్రాంతికి విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.