Read more!

English | Telugu

'ది ఇండియా హౌస్'.. రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ కొత్త చిత్రం!

సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. గతేడాది 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న నిఖిల్.. జూన్ 29న 'స్పై' అనే మరో పాన్ ఇండియా ఫిల్మ్ తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక తాజాగా 'ది ఇండియా హౌస్' అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. పైగా ఈ చిత్ర నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా భాగస్వామి కావడం విశేషం.

ఇండియా హౌస్ అనేది 1905-1910 మధ్య కాలంలో లండన్‌లో ఉన్న విద్యార్థి వసతి భవనం. న్యాయవాది శ్యామ్‌జీ కృష్ణ వర్మ ప్రోత్సాహంతో, బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులలో జాతీయవాద భావాలను పురికొల్పడానికి దీన్ని ప్రారంభించారు. దీని నేపథ్యంలోనే నిఖిల్ కొత్త చిత్రం రూపొందనుంది. నేడు(మే 28) సావర్కర్ 140 వ జయంతి సందర్భంగా 'ది ఇండియా హౌస్' చిత్రాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి రామ్ వంశీకృష్ణ దర్శకుడు. అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో శ్యామ్‌జీ కృష్ణ వర్మ పాత్రలో కనిపించనున్నారు. మూవీ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. నిఖిల్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో మ్యాజిక్ చేయడం ఖాయమనిపిస్తోంది.