English | Telugu
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ రివ్యూ
Updated : Sep 5, 2024
సినిమా పేరు:ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
నటీనటులు: విజయ్, మోహన్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్, జయరాం, అజ్మల్ అమీర్, యోగిబాబు తదితరులు
రచన దర్సకత్వం: వెంకట్ ప్రభు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఫొటోగ్రఫీ: సిద్దార్ధ నూని
ఎడిటింగ్: వెంకట్ రాజన్
నిర్మాత: కలపతి ఎస్ అఘోరాం, కలపతి ఎస్ గణేష్, కలపతి ఎస్ సురేష్
బ్యానర్: ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్
దళపతి విజయ్(vijay) ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(The greatest of all time) ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. లియో వచ్చి దగ్గర దగ్గరగా ఒన్ ఇయర్ అవ్వడంతో పాటు పొలిటికల్ వేడి కూడా తోడవ్వడంతో గోట్ పై విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
గాంధీ..(విజయ్) ఇండియన్ గవర్నమెంట్ సీక్రెట్ గా ఏర్పాటు చేసిన స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లో కమాండర్ గా వర్క్ చేస్తుంటాడు.దేశానికి హానీ తలపెట్టే ఉగ్రవాదులని ఏరి పారెయ్యడమే గాంధీ లక్ష్యం. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వైఫ్ అను (స్నేహ) కి మాత్రం ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు.జీవన్ (విజయ్) అనే ఏడేళ్ల కొడుకు కూడా ఉంటాడు.ఇక గాంధీ తో పాటే సునీల్( ప్రశాంత్) కళ్యాణ్(ప్రభుదేవా) అజయ్(అజ్మల్) లు కూడా కమాండర్స్ గా వర్క్ చేస్తుంటారు.ఉద్యోగంలో భాగంగా ఒక మిషన్ నిమిత్తం తన ఫ్యామిలీ తో కలిసి వేరే దేశం వెళ్తాడు. అక్కడ కొంత మంది దుండగలు జీవన్ ని చంపుతారు. ఆ టైంలో అను కి గాంధీ చేసే వర్క్ గురించి తెలియడంతో అప్పటినుంచి ఇద్దరు దూరంగా ఉంటారు. గాంధీ కూడా కమాండర్ పని మానేస్తాడు. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల తర్వాత గాంధీ కొడుకు జీవన్ చనిపోలేదని తెలుస్తుంది.ఇంటికి వచ్చి గాంధీ తో వాళ్ళతో పాటే ఉంటూ ఉంటాడు. సునీల్ కూతురు శ్రీనిధి( మీనాక్షి చౌదరి ) జీవన్ ప్రేమించుకుంటారు. అదే టైం లో గాంధీ మీద పగ తీర్చుకోవడానికి దేశ ద్రోహి మీనన్( మోహన్ ) కొడుకు సంజయ్( విజయ్) రా కమాండర్లు ని వరుసగా చంపుతుంటాడు. శ్రీనిధి ని కూడా చంపుతాడు.ఇదే క్రమంలో చెన్నై, ముంబై ఫైనల్ మ్యాచ్ లో విధ్వంసం చెయ్యాలని చూస్తాడు. దాన్ని గాంధీ ఎలా ఆపాడు? జీవన్ ఇన్నాళ్లు ఎవరి దగ్గర పెరిగాడు? మీనన్ కి గాంధీ మీద పగ ఎందుకు? సంజయ్ కథ ఏంటి? అతను ఎందుకు గాంధీ స్నేహితులని చంపుతున్నాడు? అనేదే ఈ కథ
ఎనాలసిస్ :
ఈ కథ లో ఏం కొత్త ధనం ఉందని విజయ్ ఒప్పుకున్నాడో తెలియదు. రీసెంట్ గా ఇదే పోలికలతో రజనీకాంత్ జైలర్ మూవీ వచ్చింది. ఈ విషయం మూవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ఈజీగా అర్ధం అవుతుంది. పైగా ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. కాకపోతే దర్శకుడు వెంకట్ ప్రభు ఏ విషయాన్నయితే సస్పెన్స్ గా ఉంచి, అదే కథకి హైలెట్ అవుతుందని బావించాడో, ఆ విషయాన్నీ గాంధీతో పాటే రన్ చేసి ఉంటే బాగుండేది. పైగా మూవీ టీజర్ లాంచ్ అయిన దగ్గర్నుంచి మూవీలో ఇద్దరు విజయ్ లని చెప్పేసారు. కాబట్టి గాంధీతో పాటే ఇంకో అతను పెరగడం చూపించాల్సింది.ఇక ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే విజయ్ కి స్నేహల మధ్య వచ్చే సీన్స్ గాని, ప్రశాంత్, ప్రభుదేవా ల మధ్య వచ్చే సీన్స్ గాని చాలా బాగున్నాయి. కానీ మెయిన్ కథ లోకి త్వరగా వచ్చేసారు. అలా కాకుండా స్నేహ, విజయ్ ల యంగేజ్ లవ్ ట్రాక్ ని చూపిస్తు దానికి కామెడీ ట్రాక్ ని లింక్ గా రాసుకొని ఉంటే బాగుండేది. అలా లేకపోవడం వల్లే సెకండ్ ఆఫ్ మొత్తం హత్యలు జరగడం, వాటిని ఇంకో విజయ్ ఎలా తీర్చుకుంటాడు అనే దాని మీదే రన్ అయ్యింది. హత్యల తాలూకు రీజన్ కూడా చాలా సిల్లీగా ఉంటుంది. పైగా కథని సాగతీయ్యడం కోసమే అనే విషయం అర్థమయిపోతుంది.అసలు అంత మందిని చంపాల్సిన అవసరం కూడా లేదు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
విజయ్ పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు.గాంధీ, జీవన్, సంజయ్ అనే మూడు విభిన్న షేడ్స్ లో సూపర్ గా చేసాడు. ముఖ్యంగా విలన్ టైప్ క్యారక్టర్ లో తన నట విశ్వరూపాన్ని చూడవచ్చు. అలాగే డాన్స్ ల్లోను తన సత్తా చాటాడు. ఇక ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ , జయరాం లు కూడా ఆయా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యి సిల్వర్ స్క్రీన్ కి నిండుతనాన్ని తెచ్చారు. యోగిబాబు కామెడీ మాత్రం వర్క్ అవుట్ కాలేదు. మిగతా పాత్రల్లో చేసిన స్నేహ, మీనాక్షి చౌదరి కూడా తమ పాత్ర పరిధి మేరకు చక్కగానే చేసారు. ఇక దర్శకుడు వెంకట్ ప్రభు విషయానికి వస్తే అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకుడ్ని కట్టిపడేసాడు. నిర్మాణ విలువలు కూడా సూపర్ గా ఉన్నాయి.యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఉంది. ఎంతలా అంటే తమిళ డబ్బింగ్ పాటలు వస్తుంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ మంది బయటకి వెళ్తారు. కానీ సాంగ్స్ వస్తుంటే ఒక్కరు కూడా బయటకి వెళ్లకుండా యువన్ తన సంగీతంతో కట్టిపడేసాడు. ఫొటోగ్రఫీ కూడా సూపర్ గా ఉండి ప్రేక్షకుల చూపులని పక్కకి తిప్పుకోకుండా చేసింది.
ఫైనల్ గా చెప్పుకోవాలంటే పాత కథ కావడం గోట్ కి మైనస్ గా పరిగణించవచ్చు. థియేటర్ నుండి బయటకి వచ్చిన ప్రేక్షకులు ఇదే మాట చెప్తున్నారు.
రేటింగ్ 2.25/ 5 అరుణా చలం