English | Telugu

టెంప‌ర్ @ 9.5 కోట్లు

తొలిరోజు నుంచే బాక్సాఫీసు ద‌గ్గ‌ర టెంప‌ర్ చూపించ‌డం మొద‌లెట్టాడు... ఎన్టీఆర్‌. బెనిఫిట్ షో నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ మొద‌లైపోయింది. దాంతో థియేట‌ర్లు హౌస్‌ఫుల్స్‌తో నిండిపోయాయి. ఏ బీ సీ.. ఇలా తేడా లేదు. టెంప‌ర్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర కుమ్మేస్తున్నాడు. శ‌ని, ఆది వారాలూ ఇదే జోరు కొన‌సాగే అవ‌కాశం ఉంది. తొలి రోజు టెంప‌ర్‌కి దాదాపుగా రూ.9.5 కోట్లు ద‌క్కిన‌ట్టు అంచ‌నా నైజా (2.7 కోట్లు), సీడెడ్ (2.10), గుంటూరు (1.30 కోట్లు) వ‌సూళ్ల బొనాంజాని రుచి చూస్తున్నాయి. ఓవ‌ర్సీస్‌లో కూడా టెంప‌ర్ ఫీవ‌ర్ పాకుతోంది. అక్క‌డా ఎన్టీఆర్‌కి రికార్డు స్థాయి వ‌సూళ్లు ద‌క్క‌డం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. ఆదివారం వ‌ర‌ల్డ్ క‌ప్ ఇండియా - పాక్ మ్యాచ్ జ‌ర‌గబోతోంది. మార్నింగ్ షో ఆట‌ల‌కు గండి ప‌డితే త‌ప్ప‌... ఎన్టీఆర్ మూడో రోజూ త‌న మ్యాజిక్ చూపించ‌డం ఖాయం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.