English | Telugu

చార్మినార్ దగ్గర మహేష్ బాబు దూకుడు షుటింగ్

చార్మినార్ దగ్గర మహేష్ బాబు "దూకుడు" షుటింగ్ ప్రస్తుతం జరుగుతూందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "దూకుడు". ఈ మహేష్ బాబు "దూకుడు" కర్ణాటక పంపిణీ హక్కులు 2.15 cr కు నాగరాజుకి అమ్మినట్లు సమాచారం.

అలాగే మహేష్ బాబు "దూకుడు" సీడెడ్ పంపిణీ హక్కులను 5.70 cr కి బళ్ళారి సాయి సోంతం చేసుకున్నారు. మహేష్ బాబు "దూకుడు" నెల్లూరు పంపిణీ హక్కులను 1.30 cr కి శ్రీ నీలకంఠన్ ఫిలింస్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు "దూకుడు" సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో జరుగుతుందని తెలిసింది. మహేష్ బాబు "దూకుడు" సినిమా షుటింగ్ ఇంకా 40 రోజుల పాటు మిగిలి ఉందనీ, కనుక ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల చేయటం అసాధ్యమనీ, సెప్టెంబర్ నెలలోనే మహేష్ బాబు "దూకుడు" విడుదలయ్యే అవకాశాలున్నాయనీ సమాచారం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.