English | Telugu

రచ్చలో రామ్ చరణ్ డబ్బున్నోడవ్వాలట

"రచ్చ" లో రామ్ చరణ్ డబ్బున్నోడవ్వాలని ప్రయత్నాలు జోరుగా చేస్తుంటాడట. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీవైట్‍ బ్యుటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, " ఏమైంది ఈ వేళ " ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "రచ్చ". ఈ "రచ్చ" సినిమా షూటింగ్ ప్రస్తుతం లింగంపల్లి సమీపంలోని అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతూంది.

హైదరాబాద్ శివార్లలో ప్రముఖహాస్యనటుడు, డాక్టర్ బ్రహ్మానందం పాల్గొన్న కొన్ని హాస్యసన్నివేశాలను కుడా ఈ చిత్రం కోసం చిత్రీకరించారు. "రచ్చ" సినిమాలోని యాక్షన్ సీన్లనూ, అలాగే కామెడీ సీన్లనూ దర్శకుడు సంపత్ నంది చాలా విభిన్నంగా ప్లాన్ చేశారనీ, ఈ సినిమాకి అతను ప్రాణం పెడుతున్నాడనీ ఆ చిత్రం యునిట్‍ చెపుతోంది. ఈ సినిమాని నవంబర్ నెల చివరలో విడుదల చేయటానికి దర్శకుడు తీవ్రంగా కృషి చేస్తున్నాడని సమాచారం. "రచ్చ" సినిమాలో హీరో రామ్ చరణ్ ఎలాగైనా ధనవంతుడవ్వాలనుకునే సామాన్యయువకుడి పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.