English | Telugu

‘మనం’ చిత్రాన్ని ఇక్కడ రీరిలీజ్‌ చెయ్యకుండా.. జపాన్‌లో రిలీజ్‌ చెయ్యడానికి రీజన్‌ ఇదే!

ఎవర్‌గ్రీన్‌ హీరో అక్కినేని నాగేశ్వరరావు దాదాపు 70 సంవత్సరాలపాటు అనేక అద్భుతమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన చివరి సినిమా ‘మనం’. ఈ సినిమాకి ఎంతో ప్రత్యేకత ఉంది. అక్కినేని ఫ్యామిలీ మూవీగా ఈ చిత్రం సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఎఎన్నార్‌, నాగార్జున, నాగచైతన్య, అమల, అఖిల్‌.. ఇలా మూడు జనరేషన్ల హీరోలు ఈ సినిమాలో కనిపించడం అనేది విశేషం. అక్కినేని అభిమానులకు కూడా ఇది ఓ అపురూప చిత్రం. 2014 మే 23న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం తెలుగు సినిమాల రీరిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగులో రీరిలీజ్‌ చెయ్యకుండా జపాన్‌లో రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఆగస్ట్‌ 8న ‘మనం’ చిత్రం జపాన్‌ ప్రేక్షకులను అలరించబోతోంది.

నాగార్జునకు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్నారు. అక్కడి అభిమానులు ఆయన్ని ‘నాగ్‌ సమా’ అని ప్రేమగా పిలుస్తారు. మూడు జనరేషన్ల హీరోలు కనిపించే ‘మనం’ చిత్రాన్ని జపాన్‌లోని చాలా థియేటర్లలో రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఈ సినిమా రిలీజ్‌ సందర్భంగా నాగార్జున జపాన్‌ వెళ్ళబోతున్నారు. మనం ప్రదర్శింపబడుతున్న ఒక థియేటర్‌లో తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ కాబోతున్నారు. ఈమధ్యకాలంలో తెలుగు సినిమాలకు జపాన్‌లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ‘మనం’ చిత్రాన్ని అక్కడ రిలీజ్‌ చేయబోతున్నారు. జపాన్‌ ప్రేక్షకులు ఫ్యామిలీ, సెంటిమెంట్‌, ఎమోషనల్‌ మూవీస్‌ని బాగా ఇష్టపడతారు. ‘మనం’ చిత్రంలో అలాంటి ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సినిమా జపాన్‌లోనూ సంచలనం సృష్టించే అవకాశం ఉంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం