English | Telugu

15 కోట్ల కన్నా పిల్లల ఆరోగ్యమే ముఖ్యమన్న రామ్‌చరణ్‌.. విషయం ఏంటంటే?

ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వార్తలు చాలా వేగంగా వైరల్‌ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్‌ హీరోలు, స్టార్‌ హీరోయిన్లకు సంబంధించిన విషయాలు మెరుపు వేగంతో దూసుకుపోతాయి. అందులో నిజానిజాలు ఏమిటి అనేది పక్కన పెడితే సోషల్‌ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే.. ఒక కంపెనీ చరణ్‌కి 15 కోట్లు ఆఫర్‌ చేస్తే దాన్ని రిజెక్ట్‌ చేశాడట. అదీ ఇప్పుడు వైరల్‌ అవుతున్న న్యూస్‌.

వివరాల్లోకి వెళితే... సాధారణంగా హీరోలు, హీరోయిన్లు పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా ఉంటారు. ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేస్తుంటారు. దాని కోసం కోట్లలో పారితోషికం అందుకుంటారు. అయితే తమ కెరీర్‌లో ఒక్క యాడ్‌ కూడా చెయ్యని హీరోలు కూడా ఉన్నారు. చరణ్‌ కొన్ని బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు ఒక ప్రొడక్ట్‌ను ప్రమోట్‌ చేసేందుకు 15 కోట్లు ఆఫర్‌ ఇచ్చిందట ఆ సంస్థ. కానీ, దాన్ని చేసేందుకు చరణ్‌ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అది చిన్న పిల్లల ఫుడ్‌కి సంబంధించిన యాడ్‌. అందులో హానికరమైన కెమికల్స్‌ ఉంటాయని తెలుసుకున్న చరణ్‌ ఆ యాడ్‌ చేసేందుకు అంగీకరించలేదు. పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టే అలాంటి ప్రొడక్ట్స్‌ను తాను ప్రమోట్‌ చెయ్యనని చెప్పారట.

ఇది అఫీషియల్‌గా వచ్చిన వార్త కాదు. సోషల్‌ మీడియాలో ఇది సర్క్యులేట్‌ అవుతోంది. అది నిజమా, కాదా అనేది పక్కన పెడితే నెటిజన్ల నుంచి మాత్రం ఈ అంశంపై మంచి స్పందన వస్తోంది. పనిలోపనిగా చరణ్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చరణ్‌ గొప్పతనాన్ని మెచ్చుకుంటూ రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. అలాగే ఈ న్యూస్‌ను షేర్‌ చేస్తూ మరింత వైరల్‌ చేస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం