Read more!

English | Telugu

రచ్చకి వ్రాయటం ఒక ఛాలెంజ్ - పరుచూరి బ్రదర్స్

"రచ్చ"కి వ్రాయటం ఒక ఛాలెంజ్ అని ఆ సినిమాకి సంభాషణలు వ్రాస్తున్న ప్రముఖ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ అన్నారు. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైందీ ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "రచ్చ". మణిశర్మ ఈ "రచ్చ" సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

పరుచూరి బ్రదర్స్ తొలిసారిగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాకి సంభాషణలు వ్రాస్తున్నారు. రామ్ చరణ్ సినిమాకి తొలిసారి మాటలు వ్రాస్తున్నందుకు ఆనందంగా ఉందనీ, అలాగే తమకు ఇదొక ఛాలెంజ్ వంటిదనీ, రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్, చిరంజీవి హీరోగా నటించిన చాలా సూపర్ హిట్ సినిమాలకు మాటలు వ్రాశామనీ, అలాగే ఈ సినిమాకి కూడా తమ శక్తి వంచన లేకుండా "రచ్చ" సినిమాకి మాటలు వ్రాస్తామనీ అన్నారు. త్వరలో ఈ "రచ్చ" సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోబోతుంది.