Read more!

English | Telugu

యన్ టి ఆర్, అల్లు అర్జున్ ఎవరు బెస్ట్ డ్యాన్సర్

యన్ టి ఆర్, అల్లు అర్జున్ ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అంటే దానికి పెద్ద చర్చే జరుగుతూంది. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్, అల్లు అర్జున్ లలో ఇద్దరూ మంచి డ్యాన్సర్లే నని అంతా అంగీకరించాలి. ఇక యంగ్ టైగర్ యన్ టి ఆర్ విషయానికొస్తే నందమూరి వంశంలో ముడో తరానికి చెందిన యువ నటుడు యన్ టి ఆర్ హీరోగా "స్టుడెంట్ నంబర్ 1" చిత్రంతో తానెలాంటి డ్యాన్సరో అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఇక "ఆది" చిత్రంతో తనలోని నటుణ్ణి కూడా ప్రేక్షకులకు చూపించాడు. ఇక "సింహాద్రి"లో తన నటన విశ్వరూపంతో పాటు తనలోని డ్యాన్సర్ దమ్ముని కూడా ప్రేక్షకులు శభాష్ అనేలా చూపించాడు. ఆ తర్వాత వచ్చిన " యమదొంగ" చిత్రంలో "నాచోరే నాచొరే" పాటలో యన్ టి ఆర్ వేసిన స్టెప్స్ ప్రేక్షకులను తన్మయులను చేశాయి. ఆ తర్వాత "అదుర్స్", "బృందావనం" చిత్రాల్లో కూడా తన నృత్యపటిమతో ప్రేక్షకులకు కన్నుల విందు చేశాడు యన్ టి ఆర్. ఇంతకీ యన్ టి ఆర్‍ ఇంత బాగా డ్యాన్స్ చేయటానికి కారణం అతనికి డ్యాన్స్ లో పునాది అనతగ్గ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటమే. కూచిపూడి, భరత నాట్యాలను అభ్యసించటం వల్లే అతని డ్యాన్స్ మూమెంట్స్ లో ఆ విధమైన పర్ ఫెక్షన్ ఉంటుంది. 

 

ఇక అల్లు అర్జున్ కి డ్యాన్స్ అంటే ప్యాజన్ ఉంది. అతనికి స్ఫూర్తి అతని మామయ్య మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి డ్యాన్స్ చూసి తాను స్ఫూర్తి పొందానని అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే అల్లు అర్జున్ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోక పోయినా యన్ టి ఆర్ కి గట్టి పోటీ ఇవ్వగల డ్యాన్సర్ అనే చెప్పాలి. అది అల్లు అర్జున్ నటించిన "ఆర్య", "బన్నీ", "హ్యాపీ", "దేశముదురు" వంటి చిత్రాల్లో ప్రతి పాటలోని డ్యాన్సులో వైవిధ్యాన్ని చూపించటానికి అతను పడే తపన, కష్తం ప్రేక్షక జనరంజకంగానే ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరికీ పోటిగా మరో యువ హీరో రామ్ చరణ్ కూడా చక్కని డ్యాన్స్ చేయగలడు. కాకపోతే అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ కాస్త క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుని ఉంటే బంగారానికి తావి అబ్బినట్టుండేది. 

 I vote for Jr.ntr