English | Telugu

మానవ హక్కుల కోసం విజయేంద్ర ప్రసాద్

మానవ హక్కుల కోసం విజయేంద్ర ప్రసాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే ఈ రోజు ఉదయం ఆరు గంటలకు సూర్యనమస్కారాలు చేసుకుంటున్న ప్రముఖ సినీ రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ ని హైదరాబాద్ సి.సి,యస్.పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళగా అక్కడ చెంగల వెంకట్రావుకి మద్దతుగా డి.సి.పి.సత్యన్నారాయణ తుపాకీతో విజయేంద్ర ప్రసాద్ కణతకు గురిపెట్టి చెక్కుల మీద 60 లక్షలు చెంగల వెంకట్రావుకివ్వవలసిన మొత్తంగా సంతకాలు చేయించాడట. సంతకాలు చేయను అన్నందుకు డి.సి.పి. విజయేమద్ర మీద దౌర్జన్యం చేశాడట.

నిజానికి చెంగల వెంకట్రావుకి విజయేంద్ర ప్రసాద్ 2004 లో ఒక సినిమా నిర్మించటానికి అవసరమైన కథనందించాడు. అందుకు ప్రతిగా చెంగల వెంకట్రావు 22 లక్షలిచ్చాడు. ఇంకా విజయేంద్ర ప్రసాద్ కి చెంగల వెంకట్రావు 41 లక్షలివ్వవలసి ఉండగా, ఆ మొత్తాన్ని అడిగినందుకు విజయేంద్రప్రసాద్ మీద డి.సి.పి.సత్యన్నారాయణ సాయంతో తిరిగి విజయేంద్ర ప్రసాదే తనకు 60 లక్షలివ్వాల్సిందని చెక్కులపై సంతకాలు దౌర్జన్యంగా చేయించుకున్నందున విజయేంద్ర ప్రసాద్ మానవహక్కుల కమీషన్ ను ఆశ్రయించాల్సి వచ్చిందని మీడియాకు తెలియజేశారు. అంతేకాకుండా ఆయన కుమారుడు ప్రముఖ యువ దర్శకుడు అయిన యస్.యస్.రాజమౌళికి కూడా పోలీసు నుండి బెదిరింపులు వస్తున్నాయని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.