English | Telugu

స్టాన్ ఫోర్డ్ లో సీటు గెల్చిన బ్రాహ్మణి

స్టాన్ ఫోర్డ్ లో సీటు గెల్చిన బ్రాహ్మణి అంటే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రథమ స్థానంలో ఉన్నదే ఈ స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం. అక్కడ సీటు రావటమంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. మన ఆసియా వాసులు కలలో కూడా ఆ యూనివర్సిటీలో సీటు వస్తుందని ఊహించరు. ఆ విశ్వవిద్యాలయంలో చదివిన వారంతా ప్రపంచంలో అత్యుత్తమ స్థాయిలో ఉన్నవారు. ఉదాహరణకు మైక్రో సాఫ్ట్ కంపెనీ సి ఇ వో స్టీవ్ బాల్మర్, గూగుల్ సృష్టికర్త సర్వే బ్రిగ్, హెచ్.పి. కంపెనీ మొదలెట్టినడేవిడ్ పాకార్డ్, నైక్ కంపెనీ సి ఇ వో ఫిలిప్స్ నైట్, సన్ మైక్రో సిస్టం చైర్ పర్సన్ స్కాట్ మెక్ మనీ, యాహూ సృష్టించిన జెర్రీ యాంగ్, డేవిడ్ ఫైల్ వంటి అత్యుత్తమ మేధావులంతా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుండి వచ్చిన వారే. అటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మన తెలుగమ్మాయి బ్రాహ్మణికి సీటు వచ్చింది.

ఇంతకీ ఎవరీ బ్రాహ్మణి అంటారా...? విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ యన్.టి.రామారావు గారి మనవరాలు, యువరత్న నందమూరి బాలకృష్ణ, వసుంధర దంపతుల జ్యేష్ట కుమార్తె, నారా వారి కోడలే ఈ బ్రాహ్మణి. అసలు బ్రాహ్మణికి ప్రపంచప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్, హోస్టన్, కెల్లాంగ్ వంటి నాలుగు యూనివర్సిటీల్లో కూడా యమ్ బి ఎ సీటు లభించింది. కానీ బ్రాహ్మణి మాత్రం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలోనే చేరటానికి నిశ్చయించుకున్నారట. బ్రహ్మణి చిన్నప్పటి నుండీ చదువులో చాలా ప్రతిభ కనపరచేదనీ, ఆమెకీ గౌరవం దక్కటం తనకు చాలా ఆనందంగా ఉందనీ ఆమె తండ్రి ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ మీడియాకు తెలియజేశారు. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటే బ్రాహ్మణిలా ఉంటుందన్నమాట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.