English | Telugu

మొదలైన ఎన్నికల సందడి.. ఓటు వేసిన టాలీవుడ్‌ హీరోలు!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది. ఉదయం 7 గంటల నుంచే అన్ని పోలింగ్‌ బూత్‌లలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్య ప్రజలతో కలిసి క్యూలో నిలబడి తమ ఓటు వేస్తున్నారు. టాలీవుడ్‌ హీరోలు చిరంజీవి, వెంకటేష్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత అని ఎంతో మందికి ఈ విషయంలో స్ఫూర్తినిస్తున్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.