English | Telugu

అర్థ‌రాత్రి ప్ర‌భాస్ గ‌ది త‌లుపు త‌ట్టిన త‌మ‌న్నా!

దేశ‌మంతా బాహుబ‌లి గురించి ఎదురుచూస్తోంది. ప్ర‌భాస్ అభిమానులైతే.. బాహుబ‌లి గురించిన ఒక్క వార్త బ‌య‌ట‌కు వ‌చ్చినా సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఈ సినిమాకి ప‌నిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణ‌లు కూడా `బాహుబ‌లి`కి తాము ప‌డిన క‌ష్టాల్ని క‌థ‌లు క‌థ‌లుగా బ‌య‌ట‌పెడుతున్నారు. ఇప్పుడు త‌మ‌న్నా వంతు వ‌చ్చింది.

ఈ సినిమా కోసం తానెంత క‌ష్ట‌ప‌డిందో, త‌న‌కెవ‌రెవ‌రు ఎలా స‌హాయ‌ప‌డ్డారో పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించింది. త‌న ప‌దేళ్ల కెరీర్‌లో ఏ సినిమాకీ ప‌డ‌ని క‌ష్టం ఈ సినిమాకి ప‌డింద‌ట త‌మ‌న్నా. ఒక్కొక్క సీన్ కోసం ఏకంగా ప‌ద్దెనిమిది గంట‌లు క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింద‌ట‌. శారీర‌కంగా మాన‌సికంగా బాగా అల‌సిపోయేద‌ట‌.

రాజమౌళి, ప్ర‌భాస్‌లు త‌న‌కెంతో స‌హ‌కారం అందించాట‌. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భాస్ ఇచ్చిన చిట్కాల‌తోనే తాను.. అంత‌బాగా న‌టించ‌గ‌లిగింద‌ట‌. త‌నకు ఏ డౌట్ వ‌చ్చినా.. అది అర్థ‌రాత్ర‌యినా స‌రే.. ప్ర‌భాస్ గ‌ది త‌లుపు త‌ట్టేద‌ట‌. ప్ర‌భాస్ కూడా ఓపిగ్గా.. త‌న సందేహాలు తీర్చేవాడ‌ట‌. కత్తి ఎలా ప‌ట్టాలా? ఫైట్స్ ఎలా చేయాలి? అనే విష‌యంపై ప్ర‌భాస్ త‌న‌కు విలువైన స‌ల‌హాలు ఇచ్చాడ‌ని మురిసిపోతోంది త‌మ‌న్నా.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.