English | Telugu

పెళ్లి సందడిలో తెల్లపిల్ల

తెల్లపిల్ల తాప్సీ పెళ్లి ఏర్పాట్లలో ఉందట. అప్పుడే పెళ్లా? ఎంత పనిచేశావ్ అమ్మడూ....అప్పుడే పెళ్లేంటి? కాస్త ఆగితే నీ సొమ్మేం పోయింది? అని అడిగితే...సొమ్ములు సంపాదించుకునేందుకే అని సమాధానం ఇచ్చిందట. ఇదేంటి పెళ్లంటోంది-సంపాదన అంటోంది అని ఆరాతీస్తే అప్పుడు తెలిసింది అసలు విషయం. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ సరైన హిట్ లేక బాధపడుతున్న బ్యూటీకి గంగ సినిమాతో మంచి పేరొచ్చింది. చక్కని నటన కనబర్చిన తాప్సీని టాలీవుడ్ నుంచి భారీ ప్రాజెక్ట్ పలకరించిందట. మహేశ్ బాబుతో శ్రీకాంత్ అడ్డాల తెరెకెక్కిస్తోన్న బ్రహ్మోత్సవంలో ఓ హీరోయిన్ గా తాప్సీని తీసుకోవాలనుకున్నారట. ఈ మాట విని ఎగిరిగంతేస్తుంది అనుకుంటే తాప్సీ పెళ్లి పనుల్లో బిజీగా ఉందట. అదేనండీ అమ్మడు త్వరలోనే వెడ్డింగ్ ప్లానర్ గా మారనుందట. తాప్సీ చెల్లెలు ఫ్రెండ్స్ తో కలసి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ త్వరలోనే లాంఛ్ చేస్తోందట. దీంతో ఈ కంపెనీ తరఫున ఈవెంట్ మేనేజ్ మెంట్ చేస్తానంటోంది తాప్సీ. మరోవైపు కోలీవుడ్ లో కాంచన హిందీ రీమేక్ కి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. మొత్తానికి హీరోయిన్ గానే కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేస్తూ దూసుకుపోతోంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.