English | Telugu
చిరంజీవి చెయ్యాల్సిన సినిమాలో హీరోగా సందీప్ కిషన్
Updated : Feb 21, 2025
'వేంకటాద్రి ఎక్స్ ప్రెస్' (Venkatadri express)మూవీతో కెరీర్ ని మొదలుపెట్టి వైవిధ భరితమైన సినిమాలు చేసుకుంటు వెళ్తున్న హీరో సందీప్ కిషన్(Sundeep Kishan)మహా శివరాత్రి కానుకగా ఈ నెల 26 న 'మజాకా'(Mazaka)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు,ఇక తను ఒప్పుకున్న సినిమాల లిస్ట్ లో తమిళ అగ్ర హీరో,తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్(Vijay)కొడుకు జేసన్ సంజయ్(jason Sanjay)సినిమా కూడా ఒకటి.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
రీసెంట్ గా 'మజాకా'ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ మాట్లాడుతు 'మజాకా'షూటింగ్ సమయంలో చిరంజీవి(Chiranjeevi)గారిని కలిసాను.ఆయనకీ నాకు మధ్య మంచి అనుబంధం ఉంది.చిరంజీవి గారు నాతో మాట్లాడుతు'మజాకా' కథ నాకెంతో నచ్చిందని,ఆ కథ చెయ్యలేకపోయినందుకు చాలా బాధపడ్డాను.నువ్వు చేసినందుకు అభినందనలు.విజయ్ కొడుకు సంజయ్ తో సినిమా చేస్తున్నావని తెలిసింది.ఒక తెలుగు హీరోతో సినిమా చెయ్యాలని వాళ్ళు కోరుకున్నారంటే మనకెంతో గర్వ కారణమని చెప్పారని వెల్లడి చేసాడు.
ఇక మజాకా మూవీ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన(Trinadarao Nakkina)దర్శకత్వంలో తెరకెక్కగా అనిల్ సుంకర,రాజేష్ దండ నిర్మించారు.సందీప్ కిషన్ సరసన రీతువర్మ(Ritu Varma)హీరోయిన్ గా చెయ్యగా రావు రమేష్, మన్మధుడు ఫేమ్ అన్షు అంబానీ,మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.లియోన్ జేమ్స్(leon James) సంగీతాన్ని అందించాడు.