English | Telugu

వైరల్ గా మారిన సుజీత్ లెటర్.. ఓజి గురించే చెప్పాడా!

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)గత నెల 25 న 'ఓజి'(OG)తో వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓజాస్ గంభీర్ గా పవన్ కనపర్చిన పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో, పవన్ కెరీర్ లోనే 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్న తొలి మూవీగా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది. దీన్ని బట్టి పవన్ తో పాటు మేకర్స్ కి 'ఓజి' ఎంత స్పెషల్ మూవీనో అర్ధం చేసుకోవచ్చు.

రీసెంట్ గా 'ఓజి' ని తెరకెక్కించిన దర్శకుడు సుజీత్(Sujeeth)సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ ని రిలీజ్ చేసాడు. చాలా విషయాలు చెబుతున్నారు కానీ ఒక సినిమా మొదలు పెట్టి చివరికి పూర్తిచేయడం ఎంత కష్టమో చాలా కొద్దిమందికే తెలుసు. నా నిర్మాత, నా టీమ్ 'ఓజి' కోసం చూపిన నమ్మకం, శక్తిని మాటల్లో చెప్పలేను. అదే ఓజి కి బలాన్ని ఇచ్చింది. ఇది ఎవరికీ సులభం కాదు. కానీ ప్రతీ కష్టం, ప్రతీ ప్రయత్నం అంకితభావం నుంచే వచ్చింది. ఈ ప్రాసెస్‌కి గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారికి, ‘ఓజీ’సినిమాకి అభిమానులు చూపుతున్న ప్రేమ, పిచ్చి మా ప్రయాణాన్ని అర్థవంతంగా మార్చింది. నిరంతరం నన్ను విశ్వసించి, మద్దతుగా నిలిచిన నిర్మాత దానయ్య గారికి నా కృతజ్ఞతలు’ అని సుజిత్ పేర్కొన్నాడు.

'ఓజి' కి బడ్జెట్ ఎక్కువ కావడంతో సుజిత్ పై దానయ్య కోపంగా ఉన్నాడని, సీక్వెల్‌ నుంచి కూడా దానయ్య తప్పుకున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో వినిపిస్తు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నోట్ తో దానయ్య(Danayya)సుజిత్ మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయనే వార్తలకి చెక్ పెట్టినట్లయింది. ఇక ఓజి నెట్ ఫ్లిక్స్(Netflix)వేదికగా ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే.



పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.