English | Telugu

రాజమౌళి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.. ఎవరు మారాలి?

- రాజమౌళి సినిమాలన్నీ కాపీలేనాా?

- రాజమౌళికి హితబోధ చేస్తున్ననెటిజన్లు

- 160 దేశాల్లో ssmb29

రాజమౌళి సినిమా ప్రారంభమైంది అంటే.. ఆరోజు నుంచే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూనస్తుంటారు. బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్‌ వరకు తీసుకెళ్లిన రాజమౌళి.. ప్రస్తుతం మహేష్‌తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది. ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.

ఎన్నో ఎదురుచూపుల తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సినిమాలో కుంభ అనే విలన్‌ పాత్రలో కనిపించబోతున్న పృథ్విరాజ్‌ సుకుమారన్‌ లుక్‌ను విడుదల చేశారు. మొదటి నుంచీ రాజమౌళి సినిమాలకు సంబంధించి విడుదలైన పోస్టర్స్‌పై విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. ఇప్పుడీ సినిమాకి కూడా అదే పరిస్థితి వచ్చింది. పోస్టర్‌ రిలీజ్‌ అయిన వెంటనే.. ఇది దానికి కాపీ, దీనికి కాపీ అంటూ ఒరిజినల్‌ పోస్టర్స్‌ని కూడా చూపిస్తున్నారు.

అంగవైకల్యంతో ఉన్న విలన్‌ రోబోటిక్‌ వీల్‌ చైర్‌లో ఉన్న స్టిల్స్‌ను, వీడియోను విడుదల చేశారు. ఈ స్టిల్‌ గతంలో వచ్చిన వైల్డ్‌ వైల్డ్‌ వెస్ట్‌, స్పైడర్‌ మాన్‌ చిత్రాల్లోని పాత్రలను పోలి ఉందని తేల్చేస్తున్నారు. వాస్తవానికి అలాంటి క్యారెక్టర్లు చాలా సినిమాల్లో ఉన్నాయి. సూర్య హీరోగా వచ్చిన 24 చిత్రంలో మూడు పాత్రల్లో కనిపిస్తాడు. అందులో ఒక పాత్ర వీల్‌ చైర్‌కే పరిమితమై ఉంటుంది. కుంభ క్యారెక్టర్‌ కూడా అదే తరహాలో ఉందని అంటున్నారు.

హాలివుడ్‌ సినిమాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని వివిధ భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. అందరిలాగే రాజమౌళి కూడా పరభాషా చిత్రాల్లోని సీన్స్‌ని కాపీ చేస్తాడనే అపవాదు ఉంది. అయితే అవేవీ పట్టించుకోని రాజమౌళి తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు. అయితే ట్రోలర్స్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలు కొన్ని వాస్తవం కావచ్చు. కానీ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నప్పటికీ రాజమౌళి తన పద్ధతి మార్చుకోవడం లేదని నెటిజన్లు అంటున్నారు.

ఇప్పటికే తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి ఇది తగదని హిత బోధ చేస్తున్నారు నెటిజన్లు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ స్థాయి సినిమాలో కూడా కాపీ సీన్స్‌ ఉండడం అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా రాజమౌళి వాస్తవంలోకి వచ్చి తనపై ట్రోలింగ్‌ జరగని విధంగా కంటెంట్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని నెజటిన్లు అభిప్రాయపడుతున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం