English | Telugu

మరో లక్ష్యం ఏప్రిల్ లో మొదలు

"లక్ష్యం" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత గోపీచంద్, శ్రీవాస్ ల కాంబినేషన్ లో మరో కొత్త చిత్రం ప్రారంభం కాబోతుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ రెండవ వారంలో మొదలుకానుంది. ఇటీవలే శ్రీవాస్ తెరకెక్కించిన "పాండవులు పాండవులు తుమ్మెదా" ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఈ తాజా చిత్రం కోసం శ్రీవాస్ ఒక పక్క కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథను సిద్ధం చేసాడని తెలిసింది. హీరోయిన్ ను ఇంకా ఖరారు చేయలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.