English | Telugu

రూ.20 కోట్లు న‌ష్ట‌పోయిన‌ 'శ్రీ‌మంతుడు'

శ్రీ‌మంతుడు రిజ‌ల్ట్ ప‌ట్ల మ‌హేష్ బాబు, అత‌ని అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే నిర్మాత‌లు మాత్రం కాస్త బెంగ పెట్టుకొన్నారు. అయ్యె అన‌వ‌స‌రంగా తొంద‌ర‌ప‌డ్డామే అని బోలెడు బాధ‌ప‌డిపోతున్నారు. దానికీ కార‌ణం ఉంది. ఇప్పుడంటే సినిమాకి పాజిటీవ్ బ‌జ్ వ‌చ్చి వ‌సూళ్లు కుమ్మేస్తోంది గానీ, విడుద‌ల‌కు ముందు ఇంత హైప్ లేదు. టీమ్ కూడా శ్రీ‌మంతుడు ఇంత పెద్ద స‌క్సెస్ అవుతుంద‌నుకోలేదు. అందుకే రాత్రికి రాత్రి ఈ సినిమాని యూరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌కి హోల్‌సేల్‌గా అమ్మేశారు. రూ.80 కోట్ల‌కు ఈసినిమా వాళ్ల చేతిలో పెట్టేశారు.

ఇప్పుడు ఈ సినిమా వంద కోట్ల దిశ‌గా దూసుకుపోతోంది. క‌నీసం వంద కోట్లు సాధించినా - రూ.20 కోట్లు శ్రీ‌మంతుడు న‌ష్ట‌పోయిన‌ట్టే. వ‌న్ - నేనొక్క‌డినే సినిమా కొని, తీవ్రంగా న‌ష్ట‌పోయింది యూరోస్ సంస్థ‌. వాళ్లు ఈ సినిమాతో కాస్త గ‌ట్టెక్క‌గ‌లిగారు. శ్రీ‌మంతుడుకి ఓవ‌రాల్‌గా రూ.120 కోట్లు రావ‌చ్చ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల అభిప్రాయం. రూ.80 కోట్లు దాటి ఎంతొచ్చినా యూరోస్ క‌ళ్ల‌లో వెలుగులు చూసే అవ‌కాశం ఉంది. రికార్డులు కొల్ల‌గొడుతున్న కొద్దీ... శ్రీ‌మంతుడు నిర్మాత‌ల మొహాలు బోసిబోతుంటాయి. ఎందుకంటే... ఆ వ‌సూళ్లంతా త‌మ ఖాతాలోకి రావాలి క‌దా. అందుకే. ఈ సినిమా హిట్ట‌యినా వాళ్ల‌కు మాత్రం సంపూర్ణ ఆనందం ద‌క్క‌డం లేదు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.