English | Telugu

స్టార్ కిడ్ చేతికి విజయ్ చేయాల్సిన భారీ ప్రాజెక్ట్..!

- 'ఎల్లమ్మ' బాటలో 'జటాయు'
- దిల్ రాజు భారీ ప్రాజెక్ట్ లో ఆ యంగ్ హీరో

ఒక హీరోతో అనుకున్న ప్రాజెక్ట్, మరో హీరోకి వెళ్ళడం అనేది చూస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో దిల్ రాజు కాంపౌండ్ లో ఇది ఎక్కువగా వినిపిస్తోంది. 'ఎల్లమ్మ' ప్రాజెక్ట్ విషయానికొస్తే.. నాని, నితిన్, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ లను దాటుకొని దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. అలాగే ఇప్పుడు 'జటాయు' కూడా ఓ కొత్త హీరో తలుపు తట్టినట్లు తెలుస్తోంది. (Jatayu)

విజయ్ ప్లేస్ లో రోషన్
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'జటాయు' అనే ఓ భారీ ప్రాజెక్ట్ ని దిల్ రాజు కొంతకాలం క్రితం ప్లాన్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ నటించే అవకాశముందని ఆమధ్య ప్రచారం జరిగింది. అయితే ఇతర స్టార్స్ పేర్లు వినిపించినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ ని విజయ్ దేవరకొండతో చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారని ప్రముఖంగా వినిపించింది. దిల్ రాజు బ్యానర్ లో ప్రస్తుతం విజయ్ 'రౌడీ జనార్దన్‌' అనే సినిమా చేస్తున్నాడు. కానీ, 'జటాయు' ఊసు మాత్రం లేదు. కొద్దిరోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి చర్చ లేదు. ఇలాంటి సమయంలో.. సడెన్ గా మరో హీరో పేరు తెరపైకి వచ్చింది.

టాలీవుడ్ నుండి కొత్త పాన్ ఇండియా హీరో
నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందD సినిమాలలో నటించిన శ్రీకాంత్ తనయుడు రోషన్.. తన లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. టాలీవుడ్ హృతిక్ రోషన్ అనే పేరు సంపాదించుకున్నాడు. సరైన సినిమా పడితే రోషన్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమనే అభిప్రాయాలు తెలుగు సినీ అభిమానుల్లో ఉన్నాయి. ప్రస్తుతం వైజయంతి బ్యానర్ లో 'ఛాంపియన్' అనే సినిమా చేస్తున్నాడు రోషన్. ఇక ఇప్పుడు 'జటాయు'లో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. 'జటాయు' పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ సినిమా విజయం సాధిస్తే.. రోషన్ రూపంలో టాలీవుడ్ నుండి మరో పాన్ ఇండియా హీరో వచ్చినట్టే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also Read: రవితేజ ఫ్యాన్స్ కి ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.