English | Telugu
శ్రీలీల దూకుడు.. ఒకే బ్యానర్ లో నాలుగు సినిమాలు!
Updated : Mar 2, 2023
యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. ఒక్క సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లోనే ఆమె నాలుగు సినిమాలు చేస్తుండటం విశేషం. శ్రీలీల జోరు చూస్తుంటే త్వరలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకునేలా ఉంది.
సితార బ్యానర్ లో రూపొందుతోన్న నాలుగు సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'SSMB 28'లో ఆమె సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే పంజా వైష్ణవ్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రం 'PVT04', నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' సినిమాలలో శ్రీలీలనే హీరోయిన్. ఇక తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న 'VD 12'లోనూ ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. మొత్తానికి ఇలా ఒకే బ్యానర్ లో ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
వీటితో పాటు ఇతర బ్యానర్స్ లో తెరకెక్కుతోన్న 'NBK 108', 'RAPO 20', 'నితిన్ 32', జూనియర్ వంటి సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాల్లో ఆమె అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో సెకండ్ హీరోయిన్ గా, 'ఓజీ'లో మెయిన్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.