English | Telugu

శ్రీజ కేసు ఏప్రిల్ 16కు వాయిదా

ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి కుమార్తె శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల కేసు విచారణ ఏప్రిల్ 16కు వాయిదా పడింది. శ్రీజ ఈనెల 15న భర్త శిరీష్, భరద్వాజ్, అత్తపై సీసీఎస్ పోలిస్ స్టేషన్ లో కేసు పెట్టింది. శిరీష్, అతని తల్లి ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేయగా కోర్టు తల్లికి మాత్రమే బెయిలు మంజూరు చేసి భరద్వాజ్ పెటిషన్ ను కొట్టివేసింది.

తన భార్యతో మాట్లాడడానికి ఒకసారి అవకాశం కల్పించాలని అతను కోర్టును కోరాడు. దీనిపై స్పందించిన కోర్టు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచనలు చేసింది. శ్రీజ తరపు న్యాయవాది వాయిదా కోరారు. దీంతో వచ్చే నెల 16కు కేసును వాయిదా వేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.